గంగాధర నెల్లూరు, (జనస్వరం) : ఎస్ఆర్ పురం మండలం, చిన్న తయ్యూరు గ్రామంలో అంజలి భాస్కర్ కుమార్తె కౌసల్యకు గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంచార్జి Dr యుగంధర్ పొన్న ఇరవై రెండు వేల రూపాయలు ఇచ్చారు. కౌసల్య ఎస్ ఆర్ ఎస్. ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల నందు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చదువుతూ నాలుగవ సెమిస్టర్ ఎగ్జామ్ రాయక, కాలేజీ ఫీజులు కట్టలేని పరిస్థితిలో, జనసేన అండగా నిలబడి, తాను ఎక్కడ కూడా చదువులో వైఫల్యం చెంది కూడదని ఉద్దేశంతో ఆదుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. తన కాళ్లమీద తాను నిలబడే వరకు జనసేన పార్టీ వారి కుటుంబానికి అండదండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసిపి ప్రభుత్వంలో స్కాలర్షిప్పులు లేక ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. కార్పొరేషన్ లేక షెడ్యూల్డ్ కులాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల కాలంలో లక్షాధికారులు కావాల్సిన షెడ్యూల్డ్ కులస్తులు ఇంకా అణగదొక్కబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ సేవకే కానీ సంపాదన కాదని తెలిపారు. పేదల పక్షపాతి పవన్ కళ్యాణ్ మాత్రమేనని తెలియజేసారు. త్వరలో ప్రజా సమస్యలపై పగడ్బందీ పోరాటం మండలాల వారీగా జరుగుతుందని తెలియజేశారు. ప్రతి మండలంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా జనవాణి ఏర్పాటు చేశారని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, ఉపాధ్యక్షులు చార్లెస్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, మండల ఐటీ కో ఆర్డినేటర్ మురుగేశన్, కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, నరసింహులు, జనసైనికులు పాల్గొన్నారు.