జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు

      శ్రీకాకుళం, (జనస్వరం) :  శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆమదాలవలస జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావు విలేకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యా జగన్మోహన్ రెడ్డి మీకు జనసేన నాయకులు అంటే ఎందుకు అంత భయం మీరు చేసే ఇసుక దందాలు, మీరు ఇచ్చిన హామీలు మరి ముఖ్యంగా మీరు ఆమదాలవలస నడిబొడ్డున మీరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాను అని ఇచ్చిన హామీని ఎక్కడ నిలదిస్తారని హుటాహుటిన తెల్లవారి జామున 5 గ కి పోలీస్ లని పంపి అరెస్ట్ చేశారు. జగన్మోహన్ అరెస్ట్ లతో మీరు మమ్మల్ని అపగలరేమో గాని ప్రజల పవన్ రావాలి పాలన మారాలి అనే బలమైన స్వరాన్ని మీరు మార్చలేరు అని పేర్కొన్నారు. అలాగే పాతపట్నం ఇంచార్జి గేదెల చైతన్య మాట్లాడుతూ వంశధార నిర్వాసితుల 2013 భూ పరిహార చట్టం ప్రకారం ఎందుకు న్యాయం చేయలేదు అని ప్రశ్నించారు. అనంతరం టెక్కలి నియోజక వర్గ ఇంచార్జి కణితి కిరణ్ మాట్లాడుతూ గతంలో టెక్కలి నియోజకవర్గ పాదయాత్రలో భాగంగా జగన్ హామీ ఇచ్చినట్టు 1108 జీ. ఓ ఎందుకు రద్దు చేయలేదు. రైతులు, గ్రామస్థులు, ఉద్యమ కారులు మీద పెట్టిన కేసులు ఎందుకు ఎత్తివేయలేదు. ఉత్తర ఆంధ్ర సృజల స్రవంతి కోసం వచ్చే బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో ఎందుకు చెప్పలేక పోయారు అని డిమాండ్ చేశారు.

See also  ఇరగవరం గ్రామం స్మశాన వాటిక అభివృద్ధి కోసం తణుకు ఇంచార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు గారు రూ. 1, 11, 111/- సాయం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి