హిందూ దేవాలయాలపై జరుగుతున్నదాడిపై సమగ్ర విచారణ జరపాలి : గునుకుల కిషోర్

హిందూ దేవాలయాలపై జరుగుతున్నదాడిపై సమగ్ర విచారణ జరపాలి : గునుకుల కిషోర్

⭕ నేడు రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడిని చూస్తుంటే హిందూ ధర్మ సంస్కృతి మనుగడ కష్టమేమో అనిపిస్తుంది… మొన్న పిఠాపురం లో విగ్రహాలు ధ్వంసం, నిన్న మన జిల్లా లో కొండబిట్ర గుంటలో రథం దహనం, ఇప్పుడు చుస్తే అంతర్వేది లో రథం దహనం ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే వీటన్నింటికీ ఒకే కారణం ఒక మతిస్థిమితం లేని వ్యక్తి గా చిత్రీకరించడం చాలా బాధాకరం..
⭕ హిందువులుగా మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు అంటూ నిరసనలు చేస్తూ ఛలో అంతర్వేది కార్యక్రమంలో నిర్వహించిన 43 మంది పై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం అమానుషం…
⭕ భక్తిశ్రద్ధలతో పూజలు జరిపే మహిళలు రాబోయే రోజుల్లో దేవాలయాలకు వెళ్ళే పరిస్థితి ఉందో లేదో అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. 
⭕ రఘుపతి రాఘవ రాజారాం ఆనే హిందూ దేవుని ఆరాదిస్తూ పాడే పాట లో….ఈశ్వర అల్లా తేరే నామ్ అని జోడించి సర్వ మతాల పట్ల భారతీయులకు ఉన్న గౌరవాన్ని చాటిచెప్పింది మన భారత్ దేశం.  అయితే ఈరోజు హిందువు మనోభావాలు దెబ్బతీస్తున్న ఇలాంటి వాటిని జనసేన బీజేపీ నాయకులు అడిగేందుకు ప్రయత్నిస్తే హౌస్ అరెస్టు లతో నాయకులను అణిచివేస్తున్న చేస్తున్న ఈ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోలేక పోతుంది.. 
⭕విదేశాల్లో ఉన్న హిందువులు వారి మనోభావాలు దెబ్బతీస్తే వెంటనే నిరసనలు తెలుపుతారు. భారతదేశంలో ఉన్న హిందువులు వీటన్నిటినీ మౌనంగా ఎందుకు బలిస్తున్నారో తెలియడం లేదు.  హిందువులుగా మనమందరం నిరసనలు తెలియజేయాలి.
⭕ఈ ప్రభుత్వం హిందుత్వం విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని తెలియజేయాలి. 
⭕ఇతర మతాలకు ఏదైనా చిన్న సమస్యలు తలెత్తితే సెక్యులరిజం అంటూ గళం విప్పే నాయకులు, పార్టీలు ఈ రోజు నోరు కదపటం లేదు.  హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే అది వారికి సమస్యలా కనిపించడం లేదేమో… 
⭕జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలియజేసినట్లు రెండు వేల రూపాయలు పెట్టి ఓటు కొనుక్కుంటాను అనుకుంటున్నారేమో ప్రజలు ఆలోచన మొదలైంది..
⭕ అన్యమత ప్రచారం జరుగుతోందని నిలదీసిన సుబ్రహ్మణ్యం గారిని బదిలీ విషయం, తిరుమల తిరుపతి ఆస్తుల అమ్మజూపటం అన్నీ గమనిస్తున్నారు..
⭕జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వివరాలు తెలియపరచండి ఇవ్వాల్సిన అవసరం ఉంది.  లేకపోతే ఒక హిందువుగా జనసేన బీజేపీ సంయుక్తంగా జరగబోవు నిరసనలను ఉద్రిక్తం చేయవలసి వస్తుందని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం..

See also  తణుకు పట్టణంలో జనంలోకి జనసేన జనం కోసం

⭕ చిన్నతనంలో మన రంగనాయకులు స్వామి గుడిలో భగవద్గీత గురించి ఉచితంగా క్లాసులు నిర్వహించి హిందూ ధర్మ ప్రచారం, హిందూ సంస్కృతి గురించి పిల్లలకు అవగాహన కార్యక్రమాలు జరుగుతుండేవి.  నేడు ఇవన్నీ అంతరించిపోయాయి ప్రభుత్వం వెంటనే స్పందించి హిందూధర్మం గురించి కూడా ప్రచారం చేయాలని ఈరోజు జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం..

ఈ సమావేశంలో గునుకుల కిషోర్, డాక్టర్ దాడి అజయ్ కుమార్, సావిత్రి, ఉషారాణి, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు…