పర్చూరులో జరిగే కౌలు రైతు సభకు వెళ్లకుండా నోటీసులు అందిస్తున్న పోలీసులు

కౌలు రైతు సభ

     పర్చూరు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు వెళ్లాల్సిన కడప జిల్లా జనసైనికులను అక్రమ అరెస్టుల పేరుతో అడ్డుకోవడం హేయమైన చర్య అని జనసేన నాయకులు పండ్రా రంజిత్ కుమార్ అన్నారు. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు తెల్లవారుజామున వరకు జనసైనికుల ఇంటి వద్ద, ఫోన్ ద్వారా, రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ పట్టుకుని స్టేషన్కు తీసుకెళ్ళి యాత్రకు వెళితే అక్రమ కేసులు పెడతామని నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటు అన్నారు. కళ్యాణ్ గారు చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర అంటే ఎందుకు ప్రభుత్వానికి అంత భయం ప్రజాస్వామ్యంలో అక్రమ అరెస్టులు పేరుతో ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన పార్టీని జనసైనికులను ఆపలేరు అని తెలిపారు . 

See also  పి.టి.జి లకు ప్రభుత్వ అంత్యోదయ కార్డులు కల్పించాలి : అరకు జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి