రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్ట మొదటి సారిగా జనసేన పార్టీ ఆఫీస్ లో గ్రంధాలయ ప్రారంభోత్సవం

రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్ట మొదటి సారిగా జనసేన పార్టీ ఆఫీస్ లో గ్రంధాలయ ప్రారంభోత్సవం

                   జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా అధినేతకి ఇష్టమైన వాటిలో ఒకటి అయిన గ్రంధాలయంను రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్ట మొదటి సారిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో  జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు & TEAM J.C.F సహకారంతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఆఫీస్ లోగ్రంధాలయంను ప్రారంభించడం జరిగింది. దీనికి దిశ దశ నిర్దేశకులు జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీస్ శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారు, శ్రీ బొలిశెట్టి సత్య నారాయణ గారు. జనసేన నాయకులు మాట్లాడుతూ పుస్తకపఠనం ప్రతి ఒక్కరూ అలవారుచుకోవాలని, పుస్తక జ్ఞానం మన మదిలో ఎప్పటికైనా నిలిచి ఉంటుందని అని అన్నారు. జనసేన తరుపున పార్టీ ఆఫీసులో గ్రంధాలయం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. సమస్యలు ఉన్నపుడు పార్టీ ఆఫీసులో పరిష్కరించడం, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయని అన్నారు. మంచి పుస్తకాలతో యువతకు మంచి మార్గనిర్దేశకం అవ్వాలని అన్నారు.  ఈ  కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్ అభ్యర్థులు, వీర మహిళలలు, నాయకులు, జనసైనికులు తదితరులు  పాల్గొన్నారు. 

See also  జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ను జయప్రదం చేయండి : జనసేన నాయకులు