అంధకారంలో ఇంద్ర నగర్ ? విద్యుత్ అధికారులు సమస్యను పరిష్కరించాలని రాహుల్ సాగర్ డిమాండ్

     ఎమ్మిగనూరు, (జనస్వరం) : గత కొన్ని రోజులుగా విద్యుత్ దీపాలు వెళ్లగకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణంలోని ఇంద్ర నగర్ ( కుర్ని కళ్యాణ మంటపం ) పక్కన ఉన్న మొదటి లైన్ గత వారం రోజుల నుంచి అంధకారంలో ఉన్నట్లు జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ఇంద్ర నగర్ వాసులు రాత్రి వేళలో తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా ద్విచక్ర వాహనంలో వచ్చే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. కనుక విద్యుత్ అధికారులు ఇంద్ర నగర్ లో ఉన్న విద్యుత్ సమస్య పై స్పందించి వెంటనే పరిస్కారం చేయాల్సిందిగా రాహుల్ సాగర్ అధికారులను  కోరారు.

See also  SC, ST సబ్ ప్లాన్ నిధులను వినియోగించి రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పన తక్షణం చేపట్టాలి - జనసేన డిమాండ్.

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి