చెకు డ్యాముల మరమ్మత్తులు తక్షణం చేపట్టాలి : అరకు జనసేన నాయకులు

అరకు

        అరకు ( జనస్వరం ) : నియోజకవర్గ కేంద్రమైన బంధం పంచాయతీ పరిధిలో గల రంపుడు వలస గ్రామంలో  జనసేన పార్టీ నియోజకవర్గ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, గతుం లక్ష్మణరావు ఆధ్వర్యంలో జనసేన బృందం ఆయా గ్రామాల్లో పర్యటించారు. ముందుగా జనసేన బృందం ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం గ్రామ పరిధిలో మరమ్మతులు ఉన్న చెకు డ్యామును గ్రామస్తులతో పాటు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ  ప్రభుత్వం తక్షణమే దంపుడు వలస మరమ్మతులో ఉన్న చెక్ డ్యాములు రిపేరింగ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం గాయాలతో బాధపడుతున్న పెద్దకాపు సోమేష్ కుమార్ చిన్నారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, శ్రీ రాములు, వల్లంగి రామకృష్ణ, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

See also  మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి