పిడుగు పాటుకు మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన ఆముదాలవలస జనసేన నాయకులు

     ఆముదాలవలస, (జనస్వరం) : ఆముదాలవలస నియోజకవర్గం, పనుకుపర్తి గ్రామంలో ఇటీవలే పిడుగు పాటుకు మృతి చెందిన 12ఏళ్ల పాప మేఘన కుటుంబానికి ఈరోజు జనసేన నాయకులు కోరుకొండ.మల్లేశ్వరావు, ఎంపీటీసీ విక్రమ్, సంగం, సంతోష్ నాయుడు, శ్రీను, ప్రసాద్, శివ్వలా.సురేష్ పరామర్శించారు. మృతి చెందిన కుటుంబంలో తండ్రికి ముగ్గురు ఆడపిల్లలు అందులో రెండో పాప చనిపోవడం చాలా బాధాకరం అని జనసేన నాయకులు చెప్పారు. ఆ కుటుంబానికి కొద్దీ రోజుల్లో గ్రామ జనసైనికులు, కార్యకర్తలతో కలిసి కొంత ఆర్థికంగా ఆ కుటుంబానికి సాయంగా ఉంటాం అని పార్టీ తరుపున భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అల్లేన గణేష్, ఆనంద్, కాశి, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  మున్సిపల్‌ ఎన్నికలకు జనసేనపార్టీ సిద్ధం - రాజంపేట జనసేన నాయకులు చెంగారి శివప్రసాద్‌