
టెక్కలి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని జనసేన, బీజేపీ నాయకులు అధికారులకు వినతి
కోటబొమ్మాళి మండలం తర్లీపేట పంచాయితీ నారాయణపురం గ్రామంలో 200 కుటుంబాలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా గ్రామ పర్యటనలో టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్ గారి తీసుకురావడం జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి ఈ భారతీయ జనతా పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమంతు ఉదయ్ భాస్కర్ గారితో కలిసి ఉమ్మడిగా తర్లీపేట పంచాయితీ స్పెషల్ ఆఫీసర్ కోటబొమ్మాళి మండల M.E.O గారికి ఈ రోజు ఈ తాగునీటి సమస్యను పరిష్కరించ వలిసిందిగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతబొమ్మాళి జనసేన ZPTC అభ్యర్థి చిన్నారెడ్డి, జనసేన శ్రీకాకుళం పార్లమెంటరీ అధికార ప్రతినిధి ముడిదాన రాంప్రసాద్, కోటబొమ్మాళి MPTC-2 అభ్యర్థి పల్లి కోటేశ్వరరావు, చంటి, అంగ అప్పన్న, గేదెల చిరంజీవి, సైన జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.









