ఉదయగిరి నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

రైతు భరోసా యాత్ర

       ఉదయగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర గోడ పత్రిక మరియు ఆటో స్టికర్ టీం పిడికిలి వారి ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం జలదంకి బస్టాండ్ ఆవరణలో జరిగింది. తదుపరి కార్యక్రమం పెరిగిన ధరలపై నిరసనగా బాదుడే బాధుడు కార్యక్రమం జరిగింది. జలదంకి మెయిన్ బజార్లో కార్యర్తలు నినాదాలతో అధికార పక్షంపై నిరసన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిమ్మలపల్లి రామ చైతన్య, మండల అధ్యక్షులు తోట మురళి, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం స్వామి, జానీ, రఘు, చక్రాల సురేశ్, పాలంకి వేణు, సురేశ్ రెడ్డి, కోటేశ్వరరావు, కొండయ్య, అరవింద్, రామూర్తి, వరికుంటపాడు రసూల్, వెంకట్, వింజమూరు సుభాని, దత్తు, రాఘవేంద్ర, హరి తదితరులు పాల్గొన్నారు.  

See also  జిల్లాకి ఇచ్చిన హామీలు మరచిపోయారా సీయం గారు ??? : త్యాడ రామకృష్ణ రావు( బాలు)

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి