
జనసేనాని జన్మదిన సందర్భంగా కరోనా ఫ్రంట్ వారియర్స్ కు సన్మానం చేసిన జనసైనికులు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా ఈ కరోనా క్లిష్టమైన సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కుటుంబాలకు దూరంగా ఉండి మనకోసం సేవ చేసిన మెడికెల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన జగన్నాథపురం గ్రామ ఆశ వర్కర్ కి జగన్నాథపురం జనసేన యూత్ ఆధ్వర్యంలో సన్మానం చేయటం జరిగింది.
ఆశ వర్కర్ మాట్లాడుతూ కరోనాని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాము ఎదుర్కొన్న సవాళ్ళను జన సైనికులతో పంచుకున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాము చేస్తున్నా సేవను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. జనసైనికులు మాట్లాడుతూ వైద్య, పోలిస్, పారిశుద్ధ్య రంగానికి చెందిన వారికి మనం ఇలాంటివి ఎన్ని చేసిన తక్కువే. ఎందుకంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు మనకి చేసిన,చే స్తున్న సేవ ఎన్నటికి మరువలేనిది. వాళ్ళకి మనం జీవితాంతం ఋణపడి ఉండాలి. ఈ కార్యక్రమంలో జగన్నాధపురం జన సైనికులు & గ్రామ యువత పాల్గొన్నారు.









