ప్రపంచ కార్మికులు దినోత్సవం సందర్భంగా కార్మికులను సత్కరించి ఉచిత మజ్జిగ పంపిణీ

కార్మికుల

          గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ ఎందరో మహానుభావులు కార్మికులు కర్షకులు పోరాటం వారి త్యాగఫలం నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే గా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. కార్మికులకు భద్రత, కార్మిక చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని కోరారు. అప్పుడే కార్మిక దినోత్సవ ఉద్దేశం నెరవేరుతుందన్నారు. గుడివాడ పట్టణ కార్మికులు కరోనా టైంలో ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి ఎంతో వర్క్ చేశారని కార్మిక సోదరులందరిని గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు అయ్యప్ప, జగదీష్, చరణ్, పవన్, నాగ సాయి, మెకానిక్ మూర్తి, మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

See also  పిఠాపురం జనసేన ఆధ్వర్యంలో మహిళల అక్క చెల్లెమ్మలకు క్రిస్మస్ కానుక

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :