కెల్లగ్రామం జనసైనికుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

   పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, కెల్ల గ్రామం జనసైనికుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిక పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యవసాయ పంటల నష్టాలతో మానసిక వేదనతో చనిపోయిన కౌలు రైతుల యొక్క కుటుంబాలకు లక్ష రూపాయలు ప్రకటించారని, ఈ విధంగా కౌలు రైతుల సుమారు 3000 కుటుంబాలకు, మొత్తం 30 కోట్లు రూపాయలు ప్రకటించడం జరిగిందని ఆ బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, స్వయంగా వాళ్లని పరామర్శించి చెక్కులు అందజేయడం జరిగింది అని గర్భాన సత్తిబాబు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇలాంటి నాయకుడిని చూడలేదని, ఇలాంటి నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే 2024 లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తధ్యమని ఆయన మీడియాతో మాట్లాడారు. YSRCP, జగన్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో MPTC అభ్యర్థి వజ్రగడ రవికుమార్, డొంక శివకుమార్, గర్భాపు నరేంద్ర, మండంగి యోగేష్, కెల్ల గ్రామ జనసైనికులు ప్రసాద్, కృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.

See also  తక్కువ కరువు మండలాలను ప్రకటించడం అధికారుల నిర్లక్ష్య బాధ్యత