Search
Close this search box.
Search
Close this search box.

ఇది రుయా హాస్పిటల్ లా? లేక వైసిపి హాస్పిటల్ లా? తిరుపతి జనసేనపార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్

● తిరుపతి రుయా ఆసుపత్రి రాష్ట్రానికే తలమానికం – కానీ అక్కడ జరుగుతున్న సంఘటనలు మాత్రం దురదృష్టకరం 

● ఇది రుయా హాస్పిటల్ లా?లేక వైసిపి హాస్పిటల్ లా?

       తిరుపతి, (జనస్వరం) : తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ జనసేన తిరుపతి అసెంబ్లీ ఇంఛార్జ్ మాట్లాడుతూ రుయాలో వేసిన ప్రతి టెండర్ వైసిపి నేతలు హస్తగతం చేసుకున్నారు. ఒక చిన్న బిడ్డ చనిపోతే అక్కడ అంబులెన్స్ మాఫియా అరాచకం సృష్టించారు. ఆ బాలుడు తండ్రిని డిమాండ్ చేసిన 20 వేల రూపాయల్లో ఎంతమందికి వాటాలు వెళ్తున్నాయి. ఇందులో వైసిపి నేతలు హస్తం ఉందా? అని అన్నారు. తిరుపతిలోని కార్పొరేటర్లు 50 రూపాయల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. నిన్న జరిగిన ఘటనలో దళిత సామాజిక వర్గనికి చెందిన అధికారిని సస్పెండ్ చేశారు. కానీ అదే వైసిపి సామాజిక వర్గానికి చెందిన వారిపై చర్యలు తీసుకోగలరా? అని ప్రశ్నించారు. గతంలో రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ లేక చనిపోతే వైసిపి నేతలు చెప్పిన వారికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు. చలివెంద్రం ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యే లు వెళ్తారు కానీ రుయాలో మీ అవినీతి కారణంగా దురదృష్ట సంఘటన జరిగితే అక్కడికి వచ్చే నాధుడే లేడు. వైద్య శాఖ మంత్రికి ఐటీ శాఖ మంత్రి ఇచ్చి ఉంటే బాగుండేది. ఆమె సోషల్ మీడియాలో తప్ప పరోక్షంగా పని చేయరు కనుక, తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో దొంగలు ఎక్కువైయ్యారు. అక్కడ ఆడ బిడ్డ పుడితే ఒక రేటు, మగ బిడ్డ పుడితే ఒక రేటు అక్కడ సిబ్బందికి ఇవ్వాలని అన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఒపి తీసుకొని వెళ్తే, డెత్ సర్టిఫికెట్ తో బయటకు వస్తున్నారు. తిరుపతి రుయా వైద్యులు, వారి సొంత ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులను పంపిస్తూ దోచుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ రుయా ఘటన దురదృష్టకరమని అంబులెన్స్ మాఫియా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. సంబంధం లేని అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. నిర్దేశించిన ధరలు ఎందుకు నిర్ణయించడం లేదు, ఎవరెవరికి ఎంతేత కమిషన్ వెళ్తోంది అని అన్నారు.రాజేష్ యాదవ్ మాట్లాడుతూ ధర్మసుపత్రిలో ధర్మము లేదు, అడుగడుగునా చేతివాటం చూపిస్తున్నారు. ఒక రోగి ఆరోగ్యం బాగాలేక, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళలేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలను జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు మధు బాబు, బాబ్జి, సుమన్ బాబు, హేమ కుమార్, రాజేష్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way