పెద్దాపురం, (జనస్వరం) : వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన విద్యుత్ చార్జీల, ఆర్టీసీ చార్జీల పెంపు పెరిగిన ఇంటి పన్ను, చెత్త పన్ను, గ్యాస్, పెట్రోల్ ధరలపై కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణంలో నిర్వహించడం జరిగింది. అలాగే జనసేన నాయకులతో కలిసి ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, గ్రామ పట్టణ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.