U1 రిజర్వడ్ జోన్ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు

   తాడేపల్లి, (జనస్వరం) : గుంటూరు జిల్లా తాడేపల్లి మండల కుంచనపల్లి, కొలనుకొండ పరిధిలో ఉన్న ( U1 రిజర్వడ్ జోన్) రైతులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్  చిల్లపల్లి శ్రీనివాసరావు మద్దతుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అయ్యా రామకృష్ణారెడ్డి రాజకీయ కోణంలో ఆలోచించకుండా ఈ సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ( U1 రిజర్వడ్ జోన్ ) ఎత్తివేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ రాష్ట్ర IT విభాగం సభ్యులు చవ్వాకుల కోటేష్ బాబు, మరియు తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు ( SNR ), గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మరియు శెట్టి రామకృష్ణ, గంజి రమేష్, మున్నా, శ్రీనివాస్, రాజారమేష్, వేణుదుర్గ, షఫీ, నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

See also  సర్ అవగాహన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ