పాయకరావుపేట జనసేన పార్టీలో పలువురు చేరికలు

పాయకరావుపేట

           పాయకరావుపేట ( జనస్వరం ) :  జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో నక్కపల్లి మండలం డొంకడ గ్రామం నుంచి టిడిపి, వైసిపి పార్టీల నుంచి 40మంది జనసేన పార్టీలో చేరారు. వీరికి గెడ్డం బుజ్జి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుజ్జి గారు వారితో మాట్లాడుతూ మీకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చిన నిరంతరం అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు. అలాగే జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కల్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.  పార్టీ లో జాయిన్ అయిన వారు చందిన రమణ, కర్రీ సత్తియ్య, నాగేశ్వరరావు, ఆదినారాయణ తదితరులు. ఈ కార్యక్రమంలో నాయకులు సూర్యచంద్ర, నల్లల రాజు, రత్నాజి, ప్రగడ శ్రీను, ఆనంద్ , గణేష్ తదితరులు పాల్గొన్నారు. 

See also  తమ సొంత నిధులతో రోడ్లు మరమ్మతులు చేసిన చిన్నదిమిలి గ్రామ జనసైనికులు