విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నిరసన

అంబేద్కర్

               ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం వల్లూరులో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని జనసేన ఆధ్వర్యంలో భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నిల్చుని నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచి పేదవాళ్లపై పెనుబారం మోపుతుందని, ఇప్పటికే కరోనా విపత్తువలన అన్ని వర్గాల ప్రజల ఆదాయాలపై పెనుబారం పడిందన్నారు. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలన్నీ ఆకాశానికి అంటాయని, ఇప్పుడు మరలా విద్యుత్ చార్జీలు పెంచితే పేదవారు జీవించేది ఎలా అని ప్రశ్నించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు ఇంట్లో ఫ్యాన్ వేసుకోవాలంటేనే భయపడేలా చేస్తున్నారని, కాబట్టి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు వద్ద భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలియచేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కడిమి ,శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

See also  శ్రీకాళహస్తిలో వినుతా కోటా ఆధ్వర్యంలో KNOW MY CONSTITUENCY కార్యక్రమం