బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 25 మంది దివ్యాంగుల మహిళపైన లైంగిక దాడులు అత్యాచారాలు జరిగినాయి. ఈ నెల 8 వ తారీఖున కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లాలోనే దివ్యాంగుల మహిళలపైన దాడులు అత్యాచారాలు జరిగిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం 2018 2019 బడ్జెట్ లో 120 కోట్లు కేటాయించినారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు బడ్జెట్ లో దివ్యాంగులకు మొండిచెయ్యి చూపించారు. 2022-2023 బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి 37 కోట్ల 20 లక్షల బడ్జెట్ పెట్టి గత ప్రభుత్వం బడ్జెట్ కన్నా తగ్గించి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అందర్నీ అవమానపరిచారు. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు పెద్ద వారందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ఏ రకంగా అవమానము చేస్తోందో చూడండి అన్నారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంట నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని పాల్గొన్నారు.