అనారోగ్యంతో చనిపోయిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మడకశిర జనసైనికులు

      మడకశిర, (జనస్వరం) : అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం రోళ్ల మండలం రత్నగిరి పంచాయతీలో రవి అనే జనసైనికుడు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కర్ణాటకలోని తుముకూరు జిల్లా ఆస్పత్రిలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసైనికులు కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా మేమున్నామంటూ మడకశిర నియోజకవర్గం జనసైనికులు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి 10,000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడైనా జనసైనికులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా జనసేనపార్టీ తరుపున  మేముంటామని భరోసా ఇవ్వడం జరిగింది.

See also  వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి. జనసేనపార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ