
జనసేనాని జన్మదిన వారోత్సవాల సందర్భంగా విజయవాడలో 50 యాచకులకు ఆహార పొట్లాలు పంపిణీ
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కృష్ణా జిల్లా (పశ్చిమ) యువత జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ద్వారా చేస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా వృద్దులకు, అనాధాలకి మరియు యచకులకి ఆహార పొట్లాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడుతూ అధ్యక్షుల వారి పిలుపు మేరకు, డొక్కా సీతమ్మ గారి స్పూర్తితో పట్టణంలో పలు ప్రదేశాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అని, వారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ సంవత్సరం ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టబోతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శెట్టి క్రిష్ణ గారు, మనుబోలు శ్రీనివాసరావు గారు పాల్గొన్నడం జరిగింది.









