ఆత్మకూరు జనసేన పార్టీలోకి చేజర్ల మండలం నుండి పలువురి చేరికలు

   ఆత్మకూరు, (జనస్వరం) : జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆత్మకూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ గారి చేతుల మీదగా చేజర్ల మండల ఇంచార్జ్ బండి అనిల్ రాయల్ గారి ఆధ్వర్యంలో చేజర్ల మండలం నుండి పలువురు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారందరికి నలిశెట్టి శ్రీధర్ పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ జనసేన పార్టీకి యువకులే బలమని రాబోయేది జనసేన ప్రభుత్వమేనని తెలియజేస్తూ నూతనంగా పార్టీలో చేరిన జనసైనికులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రసాద్, హరిబాబు, హరీష్, బలరాం, కళ్యాణ్, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

See also  విశాఖలో కోవిడ్ - 19 అవగాహన పై ప్రత్యేక సదస్సు : ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ 

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి