Search
Close this search box.
Search
Close this search box.

VRA లు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపిన కోవెలకుంట్ల జనసేన నాయకులు

     కోవెలకుంట్ల, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ప్రతి సందర్భంలో మాట తప్పి మడమ తిప్పుతున్నారని జనసేన పార్టీ నాయకులు పత్తి సురేష్ బాబు విమర్శించారు. గ్రామ రెవెన్యూ సహాయకులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ గత పది రోజులుగా స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు జనసేన పార్టీ నాయకులు పత్తి సురేష్ బాబు, దోడియం గురప్ప, బోధనము ఓబులేసు, కిట్టు, భాను ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. అనంతరం జనసేన నాయకులు పత్తి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి వీఆర్ఏలకు జీతాలు పెంచుతామని అలాగే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు అయి పోతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో మాట తప్పి మడమ తిప్పి పారిపోతున్నారు అని ఎద్దేవా చేశారు. వీఆర్ఏల డిమాండ్ల సాధనలో భాగంగా వారికి జనసేన పార్టీ మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way