నెల్లూరు ( జనస్వరం ) : సోమశిల జలాశయం పర్యటించిన అనంతసాగరం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్. ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా వర్షాల కారణంగా దెబ్బతిన్న సోమశిల జలాశయం ముందుభాగం 20 నుంచి 30 అడుగుల గోతులు పడ్డాయని, 2020 సంవత్సరం డ్యాం సేఫ్టీ రివ్యూ కమిటీ పరిశీలించి ఇవీ డ్యామ్ భద్రతకు ప్రమాదమని మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం చూస్తూ ఉండడం ప్రజల ధర్నా మన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. గత సంవత్సరం కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోవడమే కాకుండా అపార ఆస్తి ప్రాణ నష్టం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంత జరిగినప్పుడు సోమశిల జలాశయం భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలకు దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు గా తయారైంది. ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించి సోమశిల జలాశయం భద్రత పట్ల శ్రద్ధ వహించి యుద్ధ ప్రాతిపదికను దాని యొక్క ముందు భాగం మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో మండల నాయకులు పెంచల రావు, హరీష్ పెంచలయ్య, సైఫుల్లా, ఖాజా మస్తాన్, కొండయ్య, మహేంద్ర, రాజా, స్థానిక జన సైనికులు, రామకృష్ణ, ప్రసాద్ వెంకటేష్, నవీన్ ,అనిల్, చక్రి తదితరులు పాల్గొన్నారు.