జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిన జనసేన సర్పంచ్ ను అభినందించిన జనసేన నాయకులు

సర్పంచ్

                   పశ్చిమ గోదావరి ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొట్ట మొదటి సారిగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ విభాగం లో అత్తిలి 1 సచివాలయం జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచేటట్టుగా అనుక్షణం కష్టపడుతున్న జనసేన పార్టీ మహిళా సర్పంచ్ గంటా విజేత నాగరాజు దంపతులను అత్తిలి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాసేన అధ్యక్షుడు సరిపల్లి రాజేష్ మరియు తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అనుకుల రమేష్ ల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ అత్తిలి మేజర్ గ్రామ పంచాయతి కి దళిత మహిళను గెలిపించిన ప్రతి ఒక్కరికీ తన ధన్యవాదాలు తెలిపారు. తమ అత్యుత్తమ సేవల వలన జిల్లాలోనే ప్రధమ స్థానంలో నిలవటం అభినందనీయమని తెలిపారు. అనుకుల రమేష్ మాట్లాడుతూ జనసేన సిధ్ధాంతాలు తుద తప్పకుండా పాటిస్తూ అత్తిలి గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్న విజేత గారి సేవల వలన జిల్లా లో ప్రధమ స్థానంలో నిలవటం గొప్ప విషయమని అన్నారు. అలాగే ముందు ముందు మరిన్ని మెరుగైన కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరి మన్ననలు పొందాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నరసాపురం పార్లమెంట్ దళిత అధ్యక్షుడు చుక్కా సాయిబాబా మాట్లాడుతూ రాజకీయాలు ప్రజల అభివృద్ధి కొరకు సాగాలని అలా అనునిత్యం అత్తిలి అభివృద్ధి కోసం పాటుపడుతున్న విజేత నాగరాజు దంపతులను మరిన్ని అవార్డులు వరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెంతు రాజ్ కుమార్, ప్రభాకర్ రావు, పరువు వెంకట్రావు, పుప్పాల కుమారి, టి.జ్యోతి, కొర్రపాటి ప్రకాష్ బాబు, కోట సూరి బాబు, కోరుపల్లి హరి, దయానంద మూర్తి, తేలి చిట్టి బాబు తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

See also  Varahi Updates : How to improve 5 best Knowlwdge sites