జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో “దిశా- చట్టం” పై చర్చా వేదిక

     విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారి ఆధ్వర్యంలో జనసేన వీరమహిళ తుమ్మి లక్ష్మీ రాజ్ గారి అధ్యక్షతన మహిళా సంఘం అధ్యక్షులుతో “దిశా- చట్టం” పై చర్చా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాలవలస యశస్వి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు మరియు అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన “దిశా” చట్టం వల్ల ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలకు న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. అలాగే ఈ “దిశా” చట్టంలో ఉన్న లోపాలను సవరించి చట్టం అలులోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా పార్టీ నుండి పద్మావతి, జనసేన నుండి మాతా గాయిత్రి, దిశా వేల్ఫెర్ అసోసియేన్ గిరిజ, CPM పార్టీ నుండి జగదాంబ, ఎస్.కోట నుండి వెంకటలక్ష్మి, విజయనగరం నుండి వరలక్ష్మి, నీరజ మరియు స్వచ్ఛంద సంస్థ ప్రతనిధులు పలురకాల సూచనలు, సలహాలు ఇస్తూ చర్చలో పాల్గొన్నారు.

See also  పత్తికొండకు ఏం చేశావని వస్తున్నావ్ జగన్ రెడ్డి ? : CG రాజశేఖర్