
నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి 21 ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన జనసేన పార్టీ
సెప్టెంబర్ 2వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి నేడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 21 ఆక్సిజన్ సిలిండర్లు (నార్మల్ వెంటిలేటర్లు) అందజేయడం జరిగింది. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ప్రోగ్రాం కో-ఆర్డినేటర్లు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డిలు జనసేన పార్టీ జిల్లా నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, కార్యకర్తల సమక్షంలో ప్రభుత్వాసుపత్రి అనుబంధ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవికి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆడంబరాలకు పోకుండా కోవిడ్ పేషంట్లకు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలలో కొరతగా కనిపిస్తున్న ఆక్సిజన్ సిలిండర్లను అందిద్దామని పార్టీ పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు, కొణిదెల నాగబాబు గారు ఇచ్చిన సూచన మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల కిట్లు అందజేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జనసేన పార్టీ ఆధ్వరంలో 21 ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 18 కిట్లు, ప్రభుత్వ పోలీస్ ఆసుపత్రికి 3 కిట్లు అందజేయడం జరిగిందన్నారు. ఈ బృహత్కార్యానికి సహకారం అందించిన దాతలందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా జనసేన పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, ఇతర నాయకులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డితో పాటు మరొక ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ ఆత్మకూరు ఇన్ ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, సూళ్లూరుపేట ఇన్ ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, సర్వేపల్లి నుండి బొబ్బేపల్లి సురేష్ నాయుడు, పార్టీ నాయకులు కాకు మురళి రెడ్డి, లక్ష్మీమల్లేశ్వరరావు, శ్రీకాంత్ యాదవ్, చిన్నా జనసేన, అంచల సారథి, హేమంత్, మోష, కార్తీక్, వెంకటరమణ, హరీష్ రెడ్డి, కొండల్ రెడ్డి, జనసేన వీర మహిళలు ఇందిరా రెడ్డి, శిరీషారెడ్డి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.








