పాము కాటుల నుండి ప్రజల్ని కాపాడే ప్రాణదాత భాస్కర్ నాయుడు త్వరగా కోలుకోవాలి : తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్

       తిరుపతి ( జనస్వరం ) : తిరుమల తిరుపతి దేవస్థానాలలోని విద్య, వైద్య సంస్థలలో కానీ నగర శివార్లలో ఎక్కడ విష సర్పాలు కనిపించినా వాటిని టిటిడి ఉద్యోగి భాస్కర్ నాయుడు ఆయన సర్వీస్ ఉన్నంతకాలం ఆయన ప్రాణాలను పణంగా పెట్టి పట్టేవారు. పాములను పట్టుకుని అడవుల్లో వదిలి ప్రజల్ని అటు పాముల ప్రాణాల్ని కాపాడిన వ్యక్తిగా ఓ చరిత్ర ఉంది. అతను ఉద్యోగం నుండి రిటైర్ అయినప్పటికీ కూడా పామును పట్టే కోణంలో పాము కాటుకు గురై ప్రైవేట్ హాస్పిటల్ నందు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. టీటీడీ యాజమాన్యం పట్టించుకోక పోవడం బాధాకరమని జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం భాస్కర్ నాయుడు చికిత్స పొందుతున్న ప్రైవేట్ హాస్పిటల్ లో భాస్కర్ నాయుడును పరామర్శించిన, నగర అధ్యక్షులు రాజారెడ్డి భాస్కర్ నాయుడు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చేవరకు అయ్యే ఖర్చులను పూర్తిగా దేవస్థానం భరించాలని వారి కుటుంబానికి అండగా నిలవాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.

See also  అక్రమంగా అరెస్ట్ చేసిన హిందూ నాయకులను విడుదల చేయాలి : గునుకుల కిషోర్