కురుపాంలో జరిగిన అత్యాచారానికి నిరసనగా ర్యాలీ నిర్వహించిన జనసేన నాయకులు

కురుపాం

   విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా గిరిజన JAC పిలుపు మేరకు కురుపాంలో ఇద్దరు మైనర్ బాలికలపై, డిప్యూటీ CM, గిరిజనశాఖ మంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి ముఖ్య అనుచరుడు రాంబాబు అనే వైసీపీ కార్యకర్త చేసిన అత్యాచారానికి నిరసనగా జరిగిన ర్యాలీలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారు మరియు కురుపాం నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించి, బాధిత బాలికలకు తక్షణమే న్యాయం చేయాలని, వారి చదువుకు కావలసిన మౌళిక సదుపాయాలు ప్రభుత్వమే భరించి, చదువు అనంతరం ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా హామీపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమములో  కురుపాం నాయకులు వంశీ, గౌరీ శంకర్, శ్రీరామ్, ఉపేంద్ర, గోవిందమ్మ, గంగాధర్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.

See also  విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దు? అనంతపురం జిల్లా జనసేనపార్టీ నాయకులు