పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన పార్టీ కువైట్ వారి ఆధ్వర్యంలో 7వ రోజు సేవా కార్యక్రమాలు

జనసేన పార్టీ కువైట్

   రాజంపేట, (జనస్వరం) :  జనసేన పార్టీ కువైట్ వారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన మాసోత్సవాల భాగంగా కడపజిల్లా, రాజంపేట నియోజకవర్గం, సిద్దవటం మండలం మాధవరం (పార్వతీపురం) లో ప్రదీప్ అనే  వ్యక్తి కరోనా తో మరణించడం జరిగింది. కరోనా తో మరణించిన ప్రతి కుటుంబానికి,  స్థానిక ఎమ్మెల్యే 10వేలు రూపాయలు  సాయం చేస్తుండుగా ప్రదీప్ కుటుంబము  మా కమ్యూనిటీ కాదు, మాకు ఓటువేయలేదు, మేము ఇవ్వము అని స్థానిక ఎమ్మెల్యే గారు అన్నారు. స్థానిక జనసైనికులు వెంటనే జనసేన పార్టీ కువైట్ సభ్యులు మల్లికార్జున రెడ్డికి  సమాచారం ఇవ్వగా వెంటనే కొత్తూరు మల్లికార్జునరెడ్డి మరియు శివ శంకర్ సహాయంతో 10 వేల రూపాయలు ఆర్థిక సాయం, నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమములో పార్లమెంట్ ఇంఛార్జ్, రాష్ట్ర కార్యదర్శి ముఖరంఛాన్,  రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య మండల నాయకులు కొట్టే రాజేష్, యోగీంద్ర, జనసేన మాధవరం పంచాయతీ వార్డుమెంబరు పాల్గొనడం జరిగింది .

See also  హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం చేసిన గుడివాడ పట్టణ జనసైనికులు