జనసేన పార్టీ ఆధ్వర్యంలో కడప ప్రభుత్వ ఆసుపత్రిలో 17 ఆక్సిజన్ సిలెండర్లు వితరణ

జనసేన పార్టీ ఆధ్వర్యంలో కడప ప్రభుత్వ ఆసుపత్రిలో 17 ఆక్సిజన్ సిలెండర్లు దానం

                  జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ  పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వారోత్సవాల మొదటి దినం సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని ప్రభుత్వ కోవిడ్  ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు, నార్మల్ వెంటిలేటర్లను ఉచితంగా అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు కడప రిమ్స్ ఆసుపత్రికి 17 ఆక్సిజన్ యూనిట్స్ ను (ఆక్సిజన్ సిలిండర్లు, నార్మల్ వెంటిలేటర్ల ) ఉచితంగా అందించే కార్యక్రమం తాతం శెట్టి నాగేంద్ర గారి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ రావు గారు హాజరు కాగా గౌరవ అతిథులుగా రిమ్స్ RMO డా.కొండయ్య గారు, జనసేన పార్టీ కడప అసెంబ్లీ ఇంచార్జ్ మరియు రాయలసీమ పార్లమెంటరీ కమిటీ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ గారు, రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ సయ్యద్ ముక్రం చాంద్ గారు, మైదుకూరు అసెంబ్లీ ఇంచార్జ్ పి మల్హోత్రా గారు హాజరయ్యారు.  ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ కరోనా కోరల్లో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లాడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా అనేక మంది పౌరులు తమ విలువైన ప్రాణాలను కోల్పోయిన దుర్ఘటన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మనసును తీవ్రంగా కలిచివేసింది. జనసైనికులు అందరూ కూడా రాష్ట్రంలోని కోవిడ్  ఆసుపత్రులలో ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్ కొరత విషయాన్ని గమనించి ఈ సంవత్సరం జనసేనాని పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉన్నామని అన్నారు. అనుకున్నదే తడవుగా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల మొదటి రోజునే రాష్ట్రంలోని 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ప్రభుత్వ కోవిడ్  ఆసుపత్రులలో ఒకే రోజు ఒకే సమయాన ఆక్సిజన్ సిలిండర్లు, నార్మల్ వెంటిలేటర్ లను ఉచితంగా అందజేస్తున్నారు.
           మేము చేసే ఈ చిరు సాయం కారణంగా ఎంతో విలువైనటువంటి ప్రజల ప్రాణాలు రక్షించబడడమే జనసేనానికి మేము అందించే పుట్టినరోజు కానుక అని అన్నారు. ఈ ఆక్సిజన్ యునిట్స్ ద్వారా రిమ్స్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందుకుంటున్న సామాన్య ప్రజానీకానికి మరిన్ని మెరుగైన సేవలు అందించబడతాయని సహృదయంతో ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు మాలే శివ, లీగల్ సెల్ నాయకులు తోట బాలసుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి గజ్జల సాయి, అధికార ప్రతినిధి విశ్వనాధ్,  నగర కార్యదర్శి K.సురేష్ బాబు,  P.నాగరాజు , సందీప్, సర్దార్ సాయి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  ధరఖాస్తు పై తక్షణం స్పందించిన కలెక్టర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు