పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని జనసేన నాయకులు పీలా రామకృష్ణ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు, పూజలు

              జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కారోన నుండి త్వరగా కోలుకోవాలని పారిశ్రామిక ప్రాంతంలో అభిమానులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు… పశ్చిమ నియోజకవర్గం గాజువాక డిపో వద్ద వున్న ఆంజనేయ స్వామి ఆలయంలో నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, తంలాపకులతో శాస్త్రనామ అభిషేకం, పాలు, పండ్ల రసాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నూటొక్కటి (101)కొబ్బరికాయలను కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కరోనా నుండి బయట పడే వరకు నియోజకవర్గంలో ప్రతీ రోజు పూజలు నిర్వహిస్తామని తెలిపారు. జనసైనికులు, అభిమానులు ఎటువంటి నిరాశ చెందకుండా ధైర్యంగా వుండాలని అన్నారు. కొన్ని వేల కోట్ల హృదయాలని గెలుచుకున్న పవన్ కళ్యాణ్ కు భగవంతుని ఆశీసులు వుంటాయని అన్నారు. కార్యక్రమంలో కంఠంరెడ్డి శివశంకర్, ములకలపల్లి ప్రకాష్, వెంకటేష్, ఇంద్రజిత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

See also  మలేషియాకు బతుకుదెరువు కోసం వెళ్ళిన మహిళ ఆచూకీ కోసం గాలింపు : సహాయం అందిస్తామన్న జనసేన నాయకులు