100 రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట

విశాఖపట్నం ( జనస్వరం ) : కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు, వాటి పరిష్కారానికి చొరవ చూపేందుకు దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు చేపట్టిన పవనన్న ప్రజాబాట 100వ రోజుకు చేరుకుంది. దక్షిణ నియోజకవర్గంలో ఆయన చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతిచోట ఆయనకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక నాయకత్వం సహకారంతో వంద రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని దక్షిణ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగించారు. చాలా వరకు ప్రజా సమస్యలను ఆయన నెరవేర్చారు. నియోజకవర్గంలోని ప్రతి వార్డులో గడపగడపకు ఆయన పెళ్లి ప్రజల నుంచి నేరుగా సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఆ సమస్యల పరిష్కార సాధన కోసం కృషి చేశారు. పవన్ అన్న ప్రజా బాటలో భాగంగా 30 వ వార్డు జాలారిపేటకు చెందిన వెళ్ళు కుమార్తె పావనికి తాళిబొట్టు, చీర జాకెట్టు, పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయడమే తన అభిమతం అని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాను ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యజ్ఞశ్రీ, శ్రీ హరి, జోగిరాజు, చిరంజీవి, మణికంఠ, మణి, జయ, పద్మ, లలిత, దుర్గ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

See also  ఆత్మకూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న గ్రామాలను, పంటపొలాలను పరిశీలించిన ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి