అబుల్ కలాం స్ఫూర్తితో మైనార్టీల సంక్షేమం

  • కూటమి ప్రభుత్వ పాలనలో మైనార్టీలకు పెద్దపీట వేసిన సీఎం చంద్రబాబు

భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి… అనంతరం కేంద్ర ప్రభుత్వంలో మొదటి విద్యా మంత్రిగా గొప్ప బాధ్యతలు నిర్వహించి,హిందూ ముస్లిం ఐక్యతకు, విద్యా సంస్కరణలకు  మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎనలేని కృషి చేశారు. ఆయన పుట్టిన రోజును జాతీయ విద్యా దినోత్సవంతో పాటు మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాం.  మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్ఫూర్తిగా తీసుకొని మైనారిటీల హక్కులను కాపాడుతూ వారి సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1983 నుంచి అనేక కార్యక్రమాలు అమలు చేసింది.  ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేసింది. అనేక మంది మైనార్టీ నాయకులను చట్ట సభలకు పంపించి వారి అభ్యున్నతికి కృషి చేసింది.

ముస్లింల సంక్షేమమే ధ్యేయంగా :

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రూ.వేల కోట్లు ఖర్చు చేసి ఎంతో మంది పేద ముస్లిం మైనార్టీల ప్రజలకు చేయూతనందించింది. దేశంలోనే మొట్టమొదటి సారి ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా ముస్లింలకు ఆర్థిక సాయం, రుణాలు అలాగే వ్యాపార అవకాశాలు అందించింది.  రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందజేసి ముస్లింల స్వయం ఉపాధికి బాటలు వేసింది. 1996లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఉర్దూను రాష్ట్రంలో రెండవ అధికార భాషగా గుర్తించి ముస్లింలను గౌరవించారు. మైనార్టీల విద్యా, పరిపాలనా అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నారు. 1998లో ముస్లిం విద్యార్థుల కోసం విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి హైదరాబాద్‌లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ స్థాపించారు. ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్రకు సహకారం అందిస్తూనే… 2001లో టీడీపీ హయాంలోనే హైదరాబాద్‌లో హజ్ భవన్‌ను నిర్మించారు.  హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు నేరుగా విమానా సౌకర్యం కల్పించారు. ముస్లిం యాత్రికులకు హజ్ యాత్ర చేసే వాళ్లకి ఆర్థిక సహాయం అందజేశారు.

నవ్యాంధ్రలోనూ మైనార్టీకే తొలి ప్రాధాన్యత :

రాష్ట్ర విభజన అనంతరం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు సీఎం చంద్రబాబు గారు అమలు చేశారు. కర్నూల్‌లో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. విజయవాడలో హజ్ హౌస్ ఏర్పాటుకు రూ.23 కోట్లతో భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ రంగంలో పెట్టుబడులు, శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడం ద్వారా మైనార్టీలతో సహా యువతకు ఉద్యోగాలు లభించాయి.

టీడీపీ పాలనలోనే ముస్లింలకు తొలిసారి రాజ్యసభ పదవులు :

See also  సినిమా

మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూడకుండా వారి అభివృద్ధి, ఆర్థిక వికాసం, రాజకీయ చైతన్యం కల్పించేందుకు సీఎం చంద్రబాబు బాటలు వేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ముస్లిం రాజ్యసభ సభ్యుడిగా ఖలీల్ రెహ్మాన్, సైఫుల్లా,లాల్ జాన్ బాషాలకు టీడీపీ అవకాశం కల్పించింది. అలాగే ఎం.డి. ఫరూక్‌ను రెండు సార్లు మంత్రిని చేసింది. ఎండి షరీఫ్‌కి శాసనమండలి ఛైర్మన్‌ను చేసింది. రాజధాని పరిధిలో గుంటూరు జడ్పీటీసీ ఛైర్మన్‌గా జానీమూన్, అనంతపురం మున్సిపల్ ఛైర్మన్‌గా చమన్ సాబ్, ఏలూరు మేయర్‌గా నూర్జాహాన్, మార్కెట్ యార్డు ఛైర్మన్లకు అవకాశం ఇలా అనేక మంది ముస్లిం మైనార్టీ నాయకులు రాజకీయంగా ఎదిగేందుకు మైనార్టీ సంక్షేమానికి పాటు పడింది. 2024లో ముగ్గురు మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించి ముస్లింలపై సీఎం చంద్రబాబు తనకున్న ప్రేమను చాటుకున్నారు.

2014 – 2019 పాలనలో :

పేద ముస్లిం కుటుంబాలకు ఆసరాగా నిలవాలని రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ముస్లింలకు చంద్రన్న ‘‘రంజాన్ తోఫా’’ పథకం అమలు చేశారు. ఒక్కో సంవత్సరం సుమారు రూ.60 కోట్ల చొప్పున ఐదేళ్లల్లో రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేశారు. కర్నూల్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయించింది. దేశంలోనే మొదటిసారిగా ఇమామ్‌లు, మౌజమ్‌లకు వేతనాలు (నెలకు రూ. 5,000 – 10,000 పెంచి పంపిణీ చేసింది. 2014-2019 మధ్య ఐదేళ్ల పాలనలో రూ.4,000 కోట్లకు పైగా మైనార్టీ సంక్షేమానికి ఖర్చు చేసింది. ఐదేళ్లల్లో 32,722 మంది మైనారిటీ వధువులకు ‘దుల్హాన్ పథకం’ కింద రూ.163 కోట్ల విలువైన ఆర్థిక సాయం అందించింది. ముస్లిం మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించేందుకు విదేశీ విద్య పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఏటా 500 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం సాయం అందించింది. ఈ పథకానికి రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసింది. రాష్ట్రంలోని నిరుద్యోగ మైనార్టీలను ఆదుకునేందుకు జాబ్ మేళాలు నిర్వహించింది. సుమారుగా రూ.113 కోట్లతో 5,07,804 మంది విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లను అందజేసింది. పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్లను రూ.31.64 కోట్లు 39,187 మంది మైనార్టీ విద్యార్థులకు, ఉర్దూ భాష పరిరక్షణకు రూ.5 కోట్లు, కడపలో హజ్ హౌస్ నిర్మాణానికి రూ.13 కోట్లు, ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా 300 మంది మైనార్టీ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ శిక్షణను అందజేసింది. అలాగే పవిత్రమైన హజ్ యాత్రకు 2014 – 2019 మధ్య కాలంలో 12,143 మందిని పంపించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజును రాష్ట్ర పండుగగా నిర్వహించింది. మదర్సా విద్యా వాలంటీర్ల జీతం టీడీపీ ప్రభుత్వం రూ.7 వేల నుంచి రూ.10వేలకు పెంచింది.

See also  ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల జాబితా

వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి దూరంగా మైనార్టీ సోదరులు :

గత ఐదేళ్ల పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి ముస్లిం మైనార్టీలు దురమయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇమామ్, మౌజమ్‌లు, మసీద్, మదర్సాలకు ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయకుండా కాలయాపన చేశారు. విజయవాడ, కడపల్లో ఏపీ స్టేట్ హజ్ భవన్‌లకు నిధులు కేటాయించకుండా ఆపేసింది. దుల్హన్ పథకం కింద పెళ్లి కానుకలను రూ.లక్షకు పెంచుతానని ప్రకటించిన  అమలు చేయలేదు. హజ్ యాత్రకు ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిపేశారు. మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించి.. అన్ని రంగాల్లో మైనార్టీలకు ద్రోహం చేసి వారి అభివృద్ధిని అడ్డుకున్నాడు. రంజాన్ తోఫా, మైనార్టీ కార్పొరేషన్ నిధులు, దుకాన్ మకాన్, విదేశీ విద్యాధరణ పథకం, ఎన్టీఆర్ ఉన్నత విద్య వంటి 11 పథకాలను రద్దు చేశాడు. మసీదులకు మరమ్మత్తులు నిర్వహించలేదు. రంజాన్ కు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. ఉర్దూ భాషాభివృద్ధికి నిధులు కేటాయించలేదు. షాదీఖానాల నిర్మాణాలను నిలిపివేశాడు. మైనార్టీ బాలురకు సంబంధించిన 78 గురుకులాలకు రాష్ట్ర వాటా ఇవ్వకుండా ఆ పనులను నిలిపివేశాడు. 5 ఏళ్ల టీడీపీ పాలనలో మసీదుల మరమ్మత్తుల కోసం రూ.35.94 కోట్లు ఖర్చు చేశారు.  జగన్ ప్రభుత్వం నిర్మాణాలన్నింటిని కక్షపూరితంగా నిలిపివేశారు. ఐదేళ్లల్లో మసీదుల నిర్మాణాలు, మరమ్మత్తుల కోసం కేవలం రూ.87.82 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. ఐదేళ్లల్లో జగన్ రెడ్డి రంజాన్ పండుగ కోసం రూ. 1.60 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. మదర్సా విద్యా వాలెంటీర్లను జగన్ రెడ్డి పట్టించుకోలేదు.  ఐదేళ్ల జగన్ పాలనలో 50కి పైగా ముస్లింలపై దాడులు జరిగాయి. దాదాపు 8 మందిని హత్య చేశారు. కాని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. వారి కుటుంబాలను భరోసా కల్పించలేదు. జగన్ రెడ్డి జీఓ 43 తెచ్చి వక్ఫ్ బోర్డు వివాదాస్పదం చేశాడు. సుమారు 31,594.20 ఎకరాల వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతంలో ఉన్నా పట్టించుకోలేదు. ఇలా ఐదేళ్ల పాటు మైనార్టీ సోదరులకు జగన్ దోకా ఇచ్చాడు.

కూటమి ప్రభుత్వంతో మెరుగైన సంక్షేమం :

మైనార్టీల సంక్షేమ కోసం 18 నెలల్లో కూటమి ప్రభుత్వం రూ.5,434 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తోంది. మైనార్టీ సబ్ ప్లాన్ కు రూ.2,512 కోట్లు కేటాయిచింది. పీఎం జన్ వికాస్ కోసం రూ.560 కోట్లు, ముస్లిం మైనార్టీల స్వయం ఉపాధి, ఆర్థిక భరోసాకు రూ.173.57 కోట్లు కేటాయించింది. ఏపీజే కలాం ఓవర్సీస్ పథకానికి రూ.20 కోట్లు, ఇమామ్, మౌజమ్ ల వేతనాలకు రూ.90 కోట్లు, హజ్ యాత్రికులకు రూ.14 కోట్లు, ఉర్దూ అకాడమికి రూ.10.8కోట్లు కేటాయిచింది. దాదాపు 5 వేల మంది ఇమామ్ మౌజమ్ లకు రూ.45 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. 72 మంది హజ్ యాత్రికులకు తొలివిడతగా రూ.లక్ష చొప్పున రూ.72 లక్షలు అందజేశాం. షాదీ ఖానాలు – కమ్యూనిటీ నిర్మాణానికి రూ.2.90 కోట్లు నిధులు చేసి ఖర్చు చేస్తున్నారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 100 కోట్లు కేటాయించింది.  వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది.  జగన్ రెడ్డి తెచ్చిన జీఓ 43ని రద్దు చేసి… నూతన వక్ఫ్ బోర్డు ను నియమించింది. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం జిల్లాల వారిగా డిజిటైజేషన్ చేసింది. 27 వేల మంది మైనార్టీ ఆటో డ్రైవర్లకు రూ.41.37 కోట్ల ఆర్థిక సాయం అందజేశాం. అమ్మఒడి పథకం వైసీపీ పాలనలో 3.12 లక్షల మందికి రూ.468 కోట్లు మాత్రమే జమ చేస్తే… కూటమి ప్రభుత్వంలో 4.81 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.718.95 కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం మైనార్టీ గురుకులాలకు రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో 78 గురుకులాల పనులు రద్దు చేశారు. నేడు రూ.200 కోట్లతో నిలిచిపోయిన మైనార్టీ గురుకులాల పనులు ప్రారంభమయ్యాయి.

See also  తెలుగు ఎందుకో వెనుకబడిపోయింది...

నేడు 139 మందికి అబుల్ కలాం అజాద్ అవార్డులు :

ఉర్దూ బాషకు విశేషంగా కృషి చేసిన వారికి మౌలానా అజాద్ జాతీయ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. గత ప్రభుత్వం రూ.1.50 లక్షలు అందించగా, కూటమి ప్రభుత్వం దాన్ని రూ.2.50 లక్షలకు పెంచింది.  డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డుకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ. లక్ష నుంచి రూ.1.25 లక్షలకు పెంచారు. జీవనకాల సాఫల్య పురస్కారం కింద 8 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేలు అందించనున్నాం. ఉత్తమ ఉర్దూ అధ్యాపకులుగా ఐదుగురు, ఉత్తమ ఉపాధ్యాయులుగా 66 మంది ఎంపికయ్యారు. వీరికి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తారు. 58 మంది ఉత్తమ విద్యార్థులుగా ఎంపికయ్యారు. వీరికి రూ.5 వేలు చొప్పున ఇస్తారు. మొత్తంగా వివిధ కేటగిరీల కింద ఇచ్చే 139 మందికి అవార్డులు నేడు అందించబోతున్నాం.. ఇలా అడుగడుగునా ముస్లిం మైనార్టీ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేసింది. ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్‌గా కాకుండా వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వృద్ధిలోకి తీసుకొచ్చి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు సీఎం చంద్రబాబు అహర్నిషలు కృషి చేస్తున్నారు.

 

ప్రవీణ్ బోయ

పొలిటికల్ అనలిస్టు