జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ శిబిరాలకు అనూహ్యమైన స్పందన : జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

● జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వనమోదు శిబిరాలకు ఊహించని స్పందన
● పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా సభ్యత్వ శిబిరాల నిర్వహణ
● కార్యకర్తల సంక్షేమమే జనసేన లక్ష్యం

     విజయనగరం, (జనస్వరం) :   జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) విజయనగరం కోట వద్ద శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరాలకు ప్రజలనుంచి అనూహ్యమైన, ఊహించని స్పందన లభిస్తుందని, జనసేన పార్టీ సిద్ధాంతాలను, అధినేత ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని, కార్యకర్తల సంక్షేమమే జనసేన లక్ష్యమని, భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చూడట్లేదని, కేవలం జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించి ఈ జీవితభీమా పధకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ అవకాశాన్ని ప్రతీ జనసైనికులు, వీరమహిళలు, జనసేన, మెగాఫ్యామిలీ అభిమానులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ సభ్యత్వ నమోదు శిబిరంలో జనసేన పార్టీ యువనాయకులు చెల్లూరి ముత్యాల నాయుడు, సారికి విశ్వనాధ్, డాక్టర్ మురళీమోహన్, లోపింటి కళ్యాణ్, దాసరి యోగేష్, రాగోలు సాయి కిరణ్, వాసు, శ్రీను పాల్గొన్నారు.

See also  వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి చేరికలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి