భవనపాడు గ్రామంలో టెక్కలి జనసేన ఇంఛార్జ్ కణితి కిరణ్ పర్యటన

భవనపాడు గ్రామంలో టెక్కలి జనసేన ఇంఛార్జ్ కణితి కిరణ్ పర్యటన

    మత్స్యకార గ్రామమైన భవనపాడు లో ఈ రోజు టెక్కలి జనసేన పార్టీ ఇంఛార్జి కణితి కిరణ్ గారు పర్యటించారు. మొన్నటి జూన్ నెలలో షార్జా లో మరణించిన తామడ అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు. ఇంకా అతని మృతదేహాం స్వస్థలానికి  చేరకపోవడం స్థానిక జనసేననాయకులు అతని దృష్టికి తీసుకువచ్చారు. కిరణ్ గారు స్పందిస్తూ ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. అదే ఘటనలో గత 45 రోజులుగా షార్జా లో కోమాలో ఉన్న కారాడ మోహనరావు కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు. ఇప్పటికీ తన కొడుకు ఆరోగ్య సమాచారం తమకు తెలియడం లేదని వారి తల్లిదండ్రులు కిరణ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే కిరణ్ గారు కలెక్టర్ గారికి తను 2వ తేదీనే email లో విషయం తెలియచేయడం జరిగినది అని చెప్పి తమ పార్టీ గల్ఫ్ విభాగానికి చెప్పి త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తానని భరోసా ఇవ్వడం జరిగినది. అలానే భవనపాడు పోర్ట్ స్థల పరిశీలన ప్రక్రియ మొదలుపెట్టడం అయిన ఈ తరుణంలో భవనపాడు యువత, పెద్దవాళ్ళను ఆయన కలసి వారి డిమాండ్లను వినడం జరిగినది. దారిలో సెలగపేట యువత తన దృష్టికి తీసుకువచ్చిన తమ ఊరి చెరువులను 80 ఎకరాలను పోర్టు పరిశీలన భుముల నుండి తప్పించాలని వినతిపత్రం అందించారు. వారి వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో భవనపాడు జనసైనికులు, నియోజకవర్గ నాయకులు నర్శిపురం శేఖర్, లమ్మత శ్రీనివాస్, యడియూరు చిన్నారెడ్డి, భీమారావు లింగుడు తదితరులు పాల్గొన్నారు.

See also  పెదరావుపల్లి, చినరావుపల్లిలో జనం కోసం జనసేన కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి