అనంతపురం జిల్లాలో అట్టహాసంగా జనసేన మండలాధ్యక్షుల ప్రమాణ స్వీకారం

   అనంతపురం, (జనస్వరం) : అనంతపురం నగరంలోని స్థానిక రుద్రంపేట మనో ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం జనసేన జిల్లా అధ్యక్షులు టీ.సీ వరుణ్‌ అధ్యక్షతన, రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని పలు మండలాల అధ్యక్షుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. వారికీ నియామక ఉత్తర్వులు అందించారు. వారితో పాటుగా జిల్లా కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధు సూదన్‌ రెడ్డి లు మాట్లాడుతూ నియామక పత్రాన్ని అందుకున్న మండల అధ్యక్షులు అందరికీ మీపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన జనసేన అధినేత శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పని చేయాలన్నారు. జనసేన పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి పవన్‌ కళ్యాణ్‌ గారి సిద్ధాంతాలను వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఇంచార్జ్‌ ఆకుల ఉమేష్‌, రాయదుర్గం ఇంచార్జ్‌ మంజునాథ్‌ గౌడ్‌, రాప్తాడు ఇంచార్జ్‌ సాకే పవన్‌ కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్, పత్తిచంద్రశేఖర్‌, నాగేంద్ర, దాసరి రామాంజనేయులు. కార్యదర్శులు ధనుంజయ్‌, కిరణ్‌ కుమార్‌, గౌతమ్‌, చొప్ప చంద్రశేఖర్‌, మణికంఠ, రమణ, సురేష్‌, సంజీవరాయుడు, కోన చంద్రశేఖర్‌, బొగ్గరం శ్రీనివాసులు, లక్ష్మీనరసయ్య,  సంయుక్త కార్యదర్శులు చంద్రశేఖర్‌, శివ, విజయ్‌కుమార్‌, అనురాధ, జయమ్మ, బొమ్మల పురుషోత్తం రెడ్డి, జీవన్‌ కుమార్‌, రాజేష్‌ మధు, రామాంజనేయులు నాయకులు, జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

See also  వీసా - పిసిసి సమస్యలను తొందరగా పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం అందించిన జనసేన నాయకులు