
ఏ. నారాయణపురంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు, అలాగే జెండా ఆవిష్కరణ అనంతపురం రూరల్ ఏ. నారాయణపురంలో ఘనంగా జరిగాయి. ఏ.నారాయణపురం ఇంచార్జ్ జక్కిరెడ్డి ఆదినారాయణ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి, కేకు కట్ చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వస్తోంది అంటే మాకు ఒక పండగలా చేసుకుంటాం అని రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ కష్టం వచ్చిన జనసేన పార్టీ గుర్తుకు వస్తోంది అని తెలియజేశారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 600 ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఇంచార్జ్ టీసీ వరుణ్, అడ్వకేట్ జయరామి రెడ్డి, లీగల్ సెల్ మురళి, పొదిలి బాబూరావు, బార్ శీనా, వల్లంశెట్టి రమణ, అవుకు విజయ కుమార్, జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.








