జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ పార్ట్ – 2

జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ పార్ట్ – 2

జనసేనాని చాలా రోజుల తర్వాత మన ముందుకు ఇంటర్వ్యూ ద్వారా వచ్చారు. ఒకసారి జనసేనాని మనసులోని మాటను తెలుసుకుందాం.

ప్రశ్న : వైసీపీ ప్రభుత్వం పరిపాలన కాలం సంవత్సరం దాటింది. ఈ ప్రభుత్వం పై మీ విశ్లేషణ ఏమిటి ?
జవాబు : ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అత్యధిక, స్థిర౦గా ఉండే మెజారిటీని ఆ దేవుడు వాళ్ళకు కల్పించాడు. ఇలాంటి బలాన్ని ఆ పార్టీ కొందరి వ్యక్తుల కోసమో, కొన్ని కులాల కోసమో పని చేయడం బాధకరం. ఒక సంవత్సర కాలంలో న్యాయ వ్యవస్థ దాదాపుగా 62 సార్లు మొట్టికాయలు వేయడం చూశాం. ఇంత తక్కువ కాలంలో ప్రభుత్వ విధానాలను న్యాయ వ్యవస్థ తప్పు పడుతుందంటే ఎంత దారుణంగా పరిపాలన సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.

ప్రశ్న : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేసి, ప్రజల మీద భారం మోపుతుందని మీరు ఎలా భావిస్తారు ?
జవాబు : మన రాష్ట్రం అప్పులు దాదాపుగా 3.30 లక్షల కోట్లు చేసి, ఆ మొత్తాన్ని ప్రజల మీద భారం మోపడం అనేది ఒక నికుంశక చర్య. సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలంటే ఒక కుటుంబ పెద్ద అప్పులు తెచ్చి, సంసారాన్ని నడుపుతుంటే ఒకానొక దశలో ఆ అప్పులు విపరీతంగా పెరిగి తమ కొడుకుల మీద భారం పడుతుంది. గత ప్రభుత్వంలో కూడా అప్పులు చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వాలు అప్పుల దిశగా వెళ్లకుండా ఆదాయ మార్గాన్ని సమకూర్చుకొని ఆ అప్పులను తీర్చే విధంగా కష్టపడాలి. అలా అయితే రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా, తద్వారా పరిశ్రమలు కూడా వస్తాయి. సామాన్య ప్రజలకు ఎప్పుడు కూడా విద్యా, ఉఫాధి, వైద్య సదుపాయాలు అందకుండా బలయ్యిపోతాడు. ఇలా నడిచే ప్రభుత్వం తిరోగమన వైపుగా వెళుతోంది.

ప్రశ్న : న్యాయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనను తప్పు పడుతూ దాదాపుగా 62 సార్లు మొట్టికాయ వేసిన సందర్భం దీని గురించి మీరు ఏమంటారు ?
జవాబు : ప్రభుత్వంలోని పోలీసు, వైద్య, రెవెన్యూలాంటి వ్యవస్థ అధికారులు ఇపుడున్న పార్టీకి కొమ్ము కాయడం చేత ఇలాంటి ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని మనం ఊహించొచ్చు. న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం వల్ల ప్రభుత్వాలను హెచ్చరించే అధికారాలు ఉండడం వల్ల కాస్తాయినా ప్రభుత్వాలు భయంతో పని చేస్తున్నాయి. ఇలాంటి తప్పులే ఇంకా కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి మనం అగ్రరాజ్య అమెరికా దేశాన్ని చూస్తే ఒక నల్ల జాతీయుడిని చంపిన వైనానికి ఒక దేశం మొత్తం అట్టుడికిన సందర్భం చూశాం. ఒక రాష్ట్ర స్థాయి డీజీపీ వచ్చి సమాధానం చెప్పాలని కోర్టు చెప్పిన సందర్భం వచ్చిందంటే మన రాష్ట్ర పరిపాలన వ్యవస్థ ఎంత దెబ్బ తిన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చర్యలు వల్ల ప్రభుత్వ అధికారులు బలయ్యే అవకాశం ఉంది.

ప్రశ్న : ఈ కరోనా కారణంగా విద్యా వ్యవస్థ వెనుకబడడం, ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న అక్రమాలపై మీ అభిప్రాయం ?
జవాబు : నా పిల్లలు కూడా చదువుకుంటున్నారు కాబట్టి ఈ విషయం మీద కొంత స్వానుభవం ఉంది. ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి డబ్బులు ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం. ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి సదుపాయం లేకపోవడం బాధాకరం. ఒక విద్యా సంవత్సరం పూర్తిగా సమసిపోయే అవకాశాలు ఉంటే బాధాకరం అనిపిస్తోంది. కార్పొరేట్ యజామాన్యాలు అధిక ఫీజులు వసూలు చేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహించి దోపిడి చేస్తుంటే, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎటువంటి సదుపాయాలు లేకపోవడం బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఒక నిర్ణయానికి రావాలి.

ప్రశ్న : ఈ కరోనా మహమ్మారి వల్ల రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వైద్య సదుపాయాల డొల్లతన౦ కనిపించింది దీని గురించి మీరేమంటారు ?
జవాబు : గత శతాబ్దాలుగా మన దేశంలో వైద్యానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వలేదని ఈ కరోనా కాలంలో స్పష్టంగా అర్థం అవుతోంది. వైద్య శాఖను ఒక స్వయ౦ ప్రతిపత్తిగా మార్చలేకపోయారు ఈ పాలకులు. ఒకసారి మనం ఇంగ్లాండ్ లో వైద్య విధానాన్ని చూస్తే అర్థం అవుతుంది అక్కడి ప్రభుత్వాలు వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాయో. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తగిన వైద్య సదుపాయాలు లేవని స్పష్టం అవుతోంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ఇంకా మొరుగ్గా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి అనేక మంది నాకు ఫిర్యాదులు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని వైద్య సదుపాయాల మీద స్పందించమని. తొందర్లోనే మా పార్టీ సమావేశం నిర్వహించి వైద్య సదుపాయాల గురించి విజ్ఞప్తి చేస్తాం.

ప్రశ్న : కరోనా లాంటి మహమ్మారి సమస్య ఎదురైనపుడు ప్రభుత్వాలు మరియు పౌరుల బాధ్యత ఏ విధంగా ఉంటుంది. మీరు దీనిని ఏ కోణంలో చూస్తారు ?
జవాబు : నాయకత్వం బలంగా ఉంటే కింది స్థాయి నాయకులు కూడా తూ.చా పాటిస్తారు ఏ విషయాన్నైనా. దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు ఒకసారిగా లాక్ విధిస్తే దాదాపుగా 130కోట్ల ప్రజానీకం పాటించారు. ఇక్కడ మనకు నాయకత్వం ఎంత బలంగా ఉందో అర్థం అవుతోంది. రాష్ట్ర స్థాయి నాయకులు దీనిని ఒక ఫ్లూ లాంటి మాటలతో మభ్య పెట్టడం వల్ల దారుణమైన పరిస్తితి నెలకొన్న విషయం చూశాం. ప్రభుత్వ పాలకులు సరైన దిశానిర్దేశం చేయలేనపుడు ప్రజలు కూడా అస్థ్యవ్యస్తముగా తయారు అవుతారు. ప్రజాప్రతినిధులే నిర్లక్ష ధోరణి వహిస్తుంటే ప్రజలు కూడా ఆ దిశగా వెళ్ళే ఆస్కారం ఉంది. ప్రజలు సామాన్య దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అలాగే వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన ఆహారం తినాలని సూచిస్తున్నాను. ప్రజలు కూడా ప్రభుత్వాల మీద ఆధారపడటం కూడా కాస్తా ప్రమాదకరమే.

ప్రశ్న : కాపు కార్పొరేషన్ మీద శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. అలాగే ఇతర కార్పొరేషన్ నిధుల గురించి వివరణ ఇవ్వాలని కోరారు, దీని మీద స్పందన ఏమిటి ?
జవాబు : మన ప్రజాస్వామ్యంలో ఏదైనా సమస్య వస్తే దానికి అప్పుడే సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించి పోరాడాలి. లేదంటే ఆ సమస్య మరింత తీవ్రత అయ్యి పెద్దదిగా మారే అవకాశం ఉంది. సామాజిక, ఆర్థిక అంశాలని దృష్టిలో ఉంచుకొని ఈ కార్పొరేషన్లు పెట్టడం జరిగింది. ఆ రోజున మేము శ్వేతపత్రం జనసేన పార్టీ తరుపున అడిగింది ఒక కులానికి సంబందించి కాదు, అన్ని కులాల కార్పొరేషన్ల నుంచి శ్వేత పత్రం అడిగాము. గతంలో ఒకసారి నేను అరకు వెళ్ళినపుడు అక్కడి గిరిజన యువత మాకు విద్యావంతుల౦ అయ్యి కూడా మా కులానికి చెందిన కార్పొరేషన్ నుంచి నిధులు అందక నిరాశ్రయులం అవుతున్నామని, ప్రతి యేటా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నా మాకు చెందకుండా ఆ నిధులు ఎటు వెళ్తున్నాయో పోరాటం చేయాలని కోరారు. ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా కేటాయించిన నిధులను నవరత్నాలకు మళ్ళించడం దారుణం. అందుకే ఈ విషయమై మేము శ్వేత పత్రం అడిగినా ఇప్పటి వరకూ విడుదల చేయక పోవడం ఆ ప్రభుత్వం యొక్క అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల హామీల్లో భాగంగా కాపు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు మాట తప్పడం చూస్తున్నాం.

పవన్ కళ్యాణ్ జనసేనాని ఇంటర్వ్యూ పార్ట్ – 2 PDF లో డౌన్లోడ్ చేసుకోండి. 

                                                                             Download

See also  రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసైనికుడి కుటుంబానికి భరోసా ఇచ్చి, ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి