గ్యాస్ పేలి అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కడవకొల్లు నరేష్ కు జనసేన పార్టీ ఆర్థిక సహాయం

                కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో గత కొద్ది కాలం క్రితం ప్రమాదవశాత్తు గ్యాస్ పేలి రెండు కళ్ళు, కాలు కోల్పోయిన కడవ కొల్లు నరేష్ ని హాస్పటల్ నుంచి సోమవారం తన స్వగ్రామమైన కోడూరు మండల పరిధిలోని పోటు మీద గ్రామంలోని తన స్వగృహానికి తీసుకు వచ్చారు. ఇతనికి ప్రస్తుతం ఒక కన్ను పూర్తిగా తీసివేయగా మరొక కన్నుకు రెండు ఆపరేషన్లు నిర్వహించారు. అయినప్పటికీ చూపు కనిపించటం లేదు మరొక ఆపరేషన్ చేసిన యెడల కనిపించే అవకాశం ఉంటుందన్నారు వైద్యులు. ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న నరేష్ కుటుంబ సభ్యులు, ఈరోజు జనసేన పార్టీ తరుపున వెంటనే స్పందించి పోటుమీద గ్రామం వెళ్ళిన నరేష్ పలకరించి, వారి కుటుంబంకు అండగా నిలుస్తాం అనీ ఓదార్పు ఇచ్చి జనసేన పార్టీ తరుపున రాయపూడి వేణుగోపాల్ రావు గారు 5000రూపాయలు, మోదుముడి జనసైనికులు 5000 మొత్తంగా 10 వేలు రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యటం జరిగింది. త్వరలో మరల జనసేన పార్టీ తరుపున మరికొంత ఆర్థిక సహాయం చేస్తాం అనీ కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో కోడూరు జడ్పీటీసీ అభ్యర్థి సిద్దినేని అశోక్ నాయడు గారు, మత్తి సుబ్రహ్మణ్యం, బచ్చు శివ, బచ్చు భార్గవ, చందు, పోటుమీద జనసైనికులు p. వెంకటకోటీశ్వరరావు, m. వీరబాబు, B. హరిబాబు, B. సురేందర, K. నాగబాబు, N. శివశంకర్త, K. రాజా, T. నాగరాజు, K. సాయి, B. నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

See also  ఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి