
పెందుర్తిలో ” జనబాట ” కార్యక్రమం ప్రారంభం : జనసేన నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్
88 వార్డ్ పెందుర్తి నియోజకవర్గం విశాఖపట్నం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనరల్ సెక్రెటరీ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర గారి ఆధ్వర్యంలో జనబాట ప్రజా శ్రేయస్సే ముఖ్యం గెలుపే మార్గం అనే కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకొని వారి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకొని, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపడేలాగా వార్డ్ లో జనసేన పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రజల్లో చైతన్యం చేసే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ వబ్బిన జనార్దన శ్రీకాంత్ గారు మాట్లాడుతూ వార్డ్ లో ప్రజలు చాలా సమస్యలతో ఉన్నారని ఓటు వేసి గెలిపించిన వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ గారు గ్రామాలను సందర్శించిన మానేసి రూమ్ కి పరిమితమయ్యారని ఆరోపించారు. అటు ప్రతిపక్షం కూడా ప్రజలను పట్టించుకోకపోవడం లేదు. గొప్పగా చెప్పుకొనే వాలంటరీ వ్యవస్థ కూడా ప్రజాసమస్యలు తీర్చడంలో వైఫల్యం చెందారని ప్రజలు దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నప్పుడు చాలా సమస్యలు వాటర్ కార్డ్, రేషన్ కార్డ్, వీధిలైట్లు డ్రైనేజీ సమస్యలు, రోడ్లు, ఇలా చాలా సమస్యలు మాతో పంచుకోవడం జరిగిందని చెప్పారు. పెందుర్తి నాయకులు శ్రీ మోటూరు సన్యాసి నాయుడు గారు మాట్లాడుతూ నరవ గ్రామంలో గత సంవత్సరం కాలం నుంచి సచివాలయం వేరే ప్రదేశానికి మార్చి కల్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని ఉద్యమాన్ని మరింత బలపరిచే లాగా ప్రజలు ఉద్యమంలో భాగం చేసే లాగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగిందని అన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. పెందుర్తి మహిళా నాయకురాలు శ్రీ పెన్నేటి పార్వతి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు భావజాలాన్ని, నాయకత్వాన్ని బలపరిచి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ గారుని గెలిపించే విధంగా ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు వేయాలని అప్పుడే మీ సమస్యలు తీరుతాయని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశోక్ రామారావు, శ్రీను శంకర్రావు, విశ్వనాధ్, శివ, రవి నాయుడు, శ్రీను మరియు వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.








