ఏ. కొండూరులోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి : జనసేన నాయకులు

ఏ. కొండూరులోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి : జనసేన నాయకులు

           కృష్ణా జిల్లా, తిరూవూరు నియోజకవర్గం ఏ. కొండూరు మండలం చీమలపాడు మాంగో మార్కెట్ లో గిరిజన రాష్ట్ర కార్యదర్శి బి. గోపిరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పి.వి ఆంజనేయులు మాట్లాడుతూ ఏ. కొండూరు మండలం గిరిజన ప్రాంతమని ఇక్కడ ఎక్కువ మంది గిరిజనులు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అనేక మంది చనిపోయారని అన్నారు.ఇక్కడ మంజూరైన డయాలసిస్ కేంద్రాన్ని తరలించడానికి ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని అన్నారు. అన్ని మండలాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఏ.కొండూరు మండలంలోనే డయాలసిస్ కేంద్రాన్నీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలవాల రమేష్ రెడ్డి మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రం తరలిపోకుండా కలిసికట్టుగా పోరాటం చేద్దామని అన్నారు. మేకల. డేవిడ్ మాట్లాడుతూ ఏ. కొండూరు మండలం మెట్ట ప్రాంతమని ఇక్కడ త్రాగే నీటిలో ప్లోరైడ్ శాతం ఎక్కువగా ఉందని దీంతో కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు. జనసేన పార్టీ నాయకులు మనుబోలు.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కొండూరు మండలంలో డయాలసిస్ కేంద్రంతో పాటు శాశ్వత పరిష్కారంగా కిడ్నీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అన్నారు.  జెట్టి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో మంజూరైన డయాలసిస్ కేంద్రాన్ని ఏ కొండూరు మండలంలోనే ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ రౌండ్ సమావేశంలో ప్రధానంగా 2 తీర్మానాలు చేసి ఆమోదించడం జరిగింది

1. మంజూరైన డయాలసిస్ కేంద్రాన్ని ఏ. కొండూరు లొనే ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కోసం కిడ్నీ ఆసుపత్రిని మంజూరు చేయాలని తీర్మానం చేయటమైనది.

2. ఏ.కొండూరు మండలంలో జల జీవన్ మిషన్ క్రింద మంజూరైన 350 కోట్లతో ప్రతి ఇంటికి కృష్ణా జలాలను సరఫరా చేయాలని తీర్మానం చేయటమైనది.

        ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి డి. రాముడు, అధ్యక్షుడు బి. హరిబాబు, జనసేన పార్టీ నాయకులు పగడాల లక్ష్మణ రావు గారు, పి. శ్రీనివాసరావు, జి.కృష్ణా రెడ్డి,ఎం. తిరుపతిరావు, బి. శంకర్, పి. చైతన్య, వి. డేవిడ్రాజు, జి.చంద్రు నాయక్, ఎస్. రామకృష్ణ రెడ్డి, పి.ఆనందరావు, ఆళ్ల.అమ్మిరెడ్డి, దాడి.ఆదినారాయణ, త్యాగరాజు, కె.సుందరరావు, నాగూల్ మీరా,  తాళ్ల. సురేష్ ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు బి. ప్రేమరాజ్, గిరిజన సంఘం నాయకులు డి. రంగారావు, వెంకటేష్ నాయక్, బలజీనాయక్ తదితరులు పాల్గొన్నారు. 

See also  తిరుపతి జనసేన నగర కమిటీ భేటీ

ఈ సందర్భంగా 13 మందితో డయాలసిస్ కేంద్రం మరియు కిడ్నీ ఆసుపత్రి, సాధన పోరాట కమిటీ ఏర్పాటు చేయటమైనది.

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి