పిఠాపురం జనసేనపార్టీ ఆధ్వర్యంలో చర్చిల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహణ

పిఠాపురం, అక్టోబర్ 25, (జనస్వరం) : పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలోని మాదాపురం సమీపంలో ఉన్న ద సేవియర్ చర్చ్‌లో క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రార్థనలతో పాటు క్రిస్మస్ సందేశాలను విశ్వాసులకు తెలియజేశారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యుడు కొణిదెల పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురం పట్టణంలోని పలు చర్చిల్లో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదుర్ కిషోర్ పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలోని క్రైస్తవ సమాజానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో శాశ్వత ఎమ్మెల్యేగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు నామంలో ప్రేమ, సేవా భావంతో నడవాలని పిలుపునిచ్చారు.అనంతరం పేదలు మరియు వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్లు చల్లా లక్ష్మి, పెంకే జగదీష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుజ్జి, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ బొజ్జ కుమార్, కార్పొరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ మేళం రామకృష్ణ, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, సురవరపు సురేష్, బొజ్జ లోవరాజు, కొత్తం సుందరం, బాలేపల్లి రాంబాబు, రెడ్డెం జనార్ధన్, వనం వీరబాబు, మార్నీడి రంగబాబు, కమల, భాను, నాగిని, అరుణ, రత్నం, పప్పినీడి దుర్గాప్రసాద్, బొజ్జ దొరబాబు తదితర జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 15వ రోజు సేవా కార్యక్రమాలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి