రామచంద్రపురం నియోజకవర్గంలో బీజేపీ జనసేన పార్టీ ల ఆధ్వర్యంలో ” బిజెపి సేవా సప్తాహం “

రామచంద్రపురం నియోజకవర్గంలో బీజేపీ జనసేన పార్టీ ల ఆధ్వర్యంలో ” బీజేపీ సేవా సప్తాహం “

             బీజేపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ” బీజేపీ  సేవా సప్తాహం ” అనే సేవా కార్యక్రమాన్ని నరేంద్ర మోడి గారి జన్మదినోత్సవానికి ఏడు రోజులు సేవా కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటి భాగంగా ఈరోజు రామచంద్రపురం మున్సిపాలిటీ 5వ వార్డు వైయస్ఆర్ నగర్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు యస్.మాలతి రాణి గారు, మరియు అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు గౌ’ శ్రీ మానేపల్లి అయ్యాజి వేమా గారు, తూర్పు గోదావరి జిల్లా బిజేపి వైస్ ప్రెసిడెంట్ ఇళ్ల వెంకటేశ్వరరావు గారు మరియు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గౌ శ్రీ పోలిశెట్టి చంద్ర శేఖర్ గారు హాజరయ్యారు. ముందుగా డా.బి.ఆర్ అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆ తరువాత వైయస్ఆర్ నగర్ వాసులకు శానిటైజర్ మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రామచంద్రపురం పట్టణ బిజేపి అద్యక్షులు కొట్టువాడ హరిబాబు గారు రొక్కాల సత్తిబాబు గారు , పెయ్యల రాంబాబు గారు పలివెల రాజు గారు, కేశవ రాఘవేంద్రరావు గారు మరియు, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బుంగ రాజు గారు, అంకం శ్రీను గారు, అక్కిరెడ్డి శ్రీను గారు , శలగల వెంకటేష్ గారు, పున్నం ప్రకాష్ గారు, నూకపెయ్యి సందీప్ గారు, మద్దా ప్రసాద్, చిప్పాడ రాము, సి.హెచ్ శ్రీలక్ష్మీ గారు, యానాది సంఘ పెద్దలు, తదితర బిజెపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  వైసీపీ అసమర్ధ, నీచ ప్రభుత్వం : రెడ్డి అప్పలనాయుడు ఆరోపణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి