జవాద్ తుఫాన్ కు తీసుకోవలసిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విశాఖ 33వ వార్డు జనసేనపార్టీ కార్పొరేటర్ శ్రీమతి భీశెట్టి వసంత లక్ష్మి

జవాద్ తుఫాన్

     విశాఖపట్నం, (జనస్వరం) : జవాద్ తుఫాన్ కు తీసుకోవలసిన జాగ్రత్తల పై విశాఖపట్నం 33వ వార్డు జనసేనపార్టీ కార్పొరేటర్ శ్రీమతి బీశెట్టి. వసంత లక్ష్మి గారు వార్డులలో వీధి వీధికి వెళ్లి తుఫాను వలన నష్టం తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రజలకు ప్రతి వార్డులలో స్పీకర్ ద్వారా అవగాహన చేసారు. జవాద్ ప్రస్తుతం విశాఖకు 300కి మీ దూరంలో ఉంది అని, గంటకు 32కిమీ వేగంతో వైజాగ్ సమీపంలోకి దూసుకొస్తోందని, మరికొద్ది గంటల్లో వీదురు గాలులుతో కూడిన వర్షం పడుతుందని జవాద్ తుఫాన్ బారిన ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండటానికి 3 రోజులు పాటు సరిపోయే నిత్యావసర వస్తువులు, మెడిసిన్ ఇంట్లో ఉంచుకోవాలని, ఎవరు బయటికి రావద్దు అని హెచ్చరించారు. అలాగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియపరస్తూ, మీకు అన్ని విధములుగా నేను జనసేన పార్టీ, GK ఫౌండేషన్ సభ్యులు అందుబాటులో ఉంటాము అని, జీవీఎంసీ అధికారులు సిబ్బంది, అలాగే వార్డు సచివాలయం సెక్రటరీస్ మరియ వాలంటీర్స్ కూడా అందరూ అందుబాటులో ఉంటాము అని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది.

See also  కోవూరు నియోజకవర్గం అంగన్వాడి కార్యకర్తల నిరసనలకు మద్దతుగా జనసేన