మృతుడి కుటుంబానికి న్యాయం చేయమంటే కేసులుపెడతారా? జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

* జనసేన నాయకులపై కేసులు అప్రజాస్వామికం
* జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
      అమరావతి, (జనస్వరం) : విశాఖపట్నంలో రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్‌ కాన్వాయ్‌ లోని వాహనం ఢీ కొనడంతో గేదెల సూర్యనారాయణ అనే భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందారనే వార్త మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించిందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్ర మంత్రి ఆగి ప్రమాదం బారినపడిన వ్యక్తి పరిస్థితి ఏమిటని కనీసం పరామర్శ కూడా చేయకుండా వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. రెక్కల కష్టం మీద బతికే ఆ కార్మికుడు కుటుంబానికి న్యాయమైన పరిహారం ఇప్పించి, ఆ కుటుంబానికి ఆధారం కల్పించాలనే విషయాన్ని మంత్రికి తెలియచేసేందుకు వెళ్ళిన జనసేన నాయకులను పోలీసుల ద్వారా అడ్డుకొని అక్రమంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్‌ డా.సందీప్‌ పంచకర్ల, విశాఖ నార్త్‌ ఇంచార్జీ పసుపులేటి ఉషాకిరణ్‌, పార్టీ నాయకులు అప్పారావు, శాబరి శ్రీనివాస్‌, అమరాపు దుర్గ, కళ, త్రివేణిలను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు. మృతుడి కుటుంటానికి రూ.50 లక్షల పరిహారం, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లల చదువుల బాధ్యతను తీసుకోవాలని జనసేన హేతుబద్ధంగా డిమాండ్‌ చేస్తుందని అన్నారు. న్యాయం చేయమని కోరితే కేసులుపెట్టడం ఏమిటి? బాధిత కుటుంటానికి బాసటగా నిలవడం బాధ్యత కలిగిన పార్టీగా జనసేన విధి ఆయన అన్నారు. మంగళవారం అనంతపురంలో కూడా ఎయిడెడ్‌ కాలేజీలు, స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్ళిన జనసేన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలుస్తుందని తెలిపారు. న్యాయం కోసం మాట్లాడే పార్టీ నాయకులను, శ్రేణులను అరెస్టులు, కేసులతో కట్టడి చేయడం భావ్యం కాదని ఆయన తెలియజేశారు.

See also  పొత్తు ధర్మాన్ని పాటిద్దాం - కూటమి అభ్యర్థిని గెలిపిద్దాం : జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి