ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు

    ఏలూరు, (జనస్వరం) : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో 200 మంది యువకులు  జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పవన్‌ కళ్యాణ్‌ గారితో కలిసి నడవడానికి ఇష్టపడి జనసేనపార్టీలోకి చేరడం జరిగింది. ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్  రెడ్డి అప్పలనాయుడు గారి  ఆధ్వర్యంలో వారికి  కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా  ఆహ్వానించడం జరిగింది. జనసేన పార్టీ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేనపార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఇంత మంది యువకులు పార్టీలోకి చేరడం శుభపరిణామం అని అన్నారు. పార్టీలోకి చేరిన యువకులు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడే  పవన్‌ కళ్యాణ్‌ గారిని  జనసేనపార్టీ అధికారంలో నిలబెట్టడానికి తమ వంతు కృషి చేస్తామని  పార్టీలో చేరిన యువకులు తెలిపారు. భవిష్యత్లో జనసేన పార్టీ చేసే ప్రతి కార్యక్రమానికి ముందుండి నడిపించి కార్యక్రమాలు చేసి విజయవంతం చేస్తామని యువత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కాశీ నరేష్‌ మండల అధ్యక్షుడు వీరంకి పండు, జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా శ్రీనివాస్, యూత్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జానపద తేజ ప్రవీణ్‌ ఫ్యాన్స్‌ పెసిడెంట్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి యువకుడు పని చేయాలి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి