
జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 19 వ రోజు సేవాదానం
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ సభ్యులు శెట్టి శివశంకర్ గారి ఆధ్వర్యంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కో-ఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ అధ్యక్షతన ప్రొద్దుటూరు పట్నంలోని మదర్ థెరిస్సా వృద్దాశ్రమo, విజయశ్రీ వృద్దాశ్రమం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వృద్దాశ్రమం అనాథ చిన్న పిల్లల ఆశ్రమం ప్రతి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి జనసేన సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ మాదాసు మురళి గారు పాల్గొని ఆయన చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం పుణ్యకార్యాన్ని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పొద్దుటూరు పట్టణంలోని ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో పుణ్యం అని ఈ కార్యం నిర్వహించిన చేసిన శెట్టి శివ శంకర్ గారికి అలాగే 35 రోజుల పాటు 35 కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా
కడప జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి జనసేన హెల్పింగ్ హాండ్స్ స్థాపక అధ్యక్షుడిగా గంగారపు చంద్రశేఖర్ గారికి, అధ్యక్షులు కాంచన శ్రీకాంత్ గారికి అలాగే జిల్లా వ్యాప్తంగా కోఆర్డినేషన్ చేస్తున్న రంజిత్ గారికి అభినందనలు తెలిపారు. రంజిత్ కుమార్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 35 రోజులు 35 కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో 19 వ రోజు 19వ కార్యక్రమం పలు ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఈ ఆశ్రమాలలోని వృద్దులు, పేదలు, అభాగ్యులు, ప్రతి ఒక్కరు వారి దీవెనలు పవన్ కళ్యాణ్ గారికి అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాదాసు మురళి గారికి పొద్దుటూరు నియోజకవర్గంలోని జనసేన సైనికులకు మెగా అభిమానులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్, రవిప్రసాద్ కమలాపురం జన సైనికుడు అతికారి నాగేంద్ర పొద్దుటూరు జనసైనికులు రాజు, పవన్, మంచాల సంజీవ్, చోటు, వినోద్, నందా మేఘశ్యామ్, మధు రాయల్, విజయ్, పాల్గొన్నారు.









