రాజంపేట, (జనస్వరం) : రిపబ్లిక్ మూవీ ప్రీరెలీజ్ ఫంక్షన్ లో సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వ ధోరణి ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు తప్పు పట్టడాన్ని రాజంపేట జనసేన పార్టీ నాయకులు బాల సాయి కృష్ణ గారు తీవ్రంగా ఖండించారు. పారదర్శకత పేరుతో ప్రభుత్వం సినిమా టిక్కెట్లు అమ్మడం ఏంటి, ప్రభుత్వ బాధ్యత మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య, ఉపాధి కల్పన, ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు వేయడం, మద్యపానం నిషేధం ధరల నియంత్రణ అనే నినాదాలతో అత్యధిక సీట్లతో గెలిచిన వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని నేరుగా పిచ్చి పిచ్చి బ్రాండ్ల పేరుతో అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రోడ్లు పాడయ్యాయి అని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినా ఎలాంటి చర్యలు లేదు. కరోనా సమయంలో మెడికల్ మాఫియా ప్రజలను దోచుకుంటే ఎలాంటి కదలిక లేదు, కార్పొరేట్ స్కూల్స్ లక్షల్లో విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేస్తూ ఉంటే చిన్న చిన్న స్కూల్లో యాజమాన్యాలను వేధిస్తూ కార్పొరేట్ స్కూల్స్ ను ప్రోత్సహిస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న కరెంట్ ధరలను నియంత్రించే చర్యలు శూన్యం. కులానికి కార్పొరేషన్ పేరిట కులాలను వేరుచేసి వాటి నిధులను వివిధ సంక్షేమ పథకాలకు వాడటమే కాకుండా ఆ కార్పొరేషన్లను అప్పుల్లో దించి ఈ ప్రభుత్వం పారదర్శకత కార్పొరేషన్ మీద ఎంత లోన్ తీసుకున్నారు ఎంతమందికి వాటి ద్వారా మేలు జరిగిందని శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి. ఎలాంటి అభివృద్ధి లేకుండా రెండు లక్షల కోట్లు గత రెండు ఏళ్ళుగా అప్పులు చేసి చెత్త నుండి చింతపండు వరకు, ఇసుక నుండి ఇనుము వరకు ప్రతి ఒక్క వస్తువుల ధరలు పెంచిన ఈ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు నియంత్రిస్తారు అనడం హాస్యాస్పదంగా ఉంది. వైసిపి ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందడమే కాకుండా కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, కాంట్రాక్టు కూలీలకు కూలీ ఇవ్వలేని స్థాయికి తీసుకువచ్చింది. సినిమా టికెట్లు కంటే ముందు కార్పొరేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ స్కూల్స్ నుంచి వసూలు చేసే ఫీజులు పారదర్శకంగా ప్రభుత్వమే వసూలు చేయాలి మరియు సినిమా టికెట్లు మటన్ షాపుల మీద చూపే శ్రద్ధ నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, ఉపాధి కల్పన, నూతన పరిశ్రమల ఏర్పాటు, నూతన రోడ్ల నిర్మాణం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని రాజంపేట జనసేన నాయకుడు బాలసాయికృష్ణ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.