కరోనా రోగులకు పండ్లను అందించిన రామచంద్రపురం జనసేన నాయకులు

కరోనా రోగులకు పండ్లను అందించిన రామచంద్రపురం జనసేన నాయకులు

        రామచంద్రపురం పట్టణం ఏరియా హాస్పిటల్ లో ఉన్న కరోనా బారిన పడిన వారికి త్వరగా కోలుకోవాలని ఇమ్యూనిటీ పెంచే ఉద్దేశంతో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.  రామచంద్రపురం నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు  మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ప్రజలు త్వరగా కోలుకుని ఆరోగ్యవంతంగా ఉండాలనే మంచి ఉద్దేశ్యం తో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కరోనా విపత్కర సమయంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమ౦ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సహాయం చేయడం ఒక జనసేన పార్టీకే సాధ్యం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , అక్కిరెడ్డి శ్రీను గారు, బుంగారాజు గారు, రాంబాబు నాయుడు, తోటరామక్రిష్ణ, కర్రా నాగేశ్వరరావు, ప్రసాద్ తదితర జనసైనికులు, బిజేపి నాయకులు పి. కేశవ రాఘవేంద్రరావు గారు, వెత్సా చంద్రగుప్త గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

See also  జనసేన నాయకులు గజ్జల సాయి కుటుంబానికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు : ఆదుకున్న కడప జనసేన నాయకులు